ఘనంగా ఓదెల మల్లన్న పెద్ద పట్నం

ఘనంగా ఓదెల మల్లన్న పెద్ద పట్నం

 పెద్దపల్లి, వెలుగు:  ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒగ్గు కళాకారులు, భక్తులు పెద్ద పట్నం వేడుకను నిర్వహించారు.  సోమవారం ఉదయం 5 గంటల వరకు పెద్ద పట్నం వేడుక జరగ్గా, ఉదయం 5 గంటలకు అగ్నిగుండాల వేడుక నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని ప్రదర్శించారు. బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.