
ముఖానికి జుట్టు ఎంతో అందాన్ని ఇస్తుంది. అలంటి జుట్టు అందంగా, దృడంగా, పొడవుగా ఉండాలంటే కొన్ని జగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఈ రోజుల్లో చాల మందికి జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా ఇంకా పెరగకపోవడం వంటి సమస్యలు ఎదురుకొంటున్నారు. అసలు జుట్టు పెరగడానికి ఉల్లిపాయ నూనె ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం మన అమ్మమ్మల నుండి కథలు వింటున్నాం. ఈ ఉల్లిపాయ నూనెలో పుష్కలంగా సల్ఫర్ ఉంటుంది, ఇది జుట్టులో కనిపించే ముఖ్యమైన ప్రొటీన్ అయిన కెరాటిన్‌ను బలంగా చేయడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ నూనెను తలకు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, జుట్టు కుదుళ్లకు పోషణ లభిస్తుంది అలాగే మొత్తం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలంటి ఉల్లిపాయ నూనెని సులభంగా ఇంట్లో తయారు చేసుకొని వాడొచ్చు....
కావలసిన పదార్థాలు: 500 గ్రాముల కొబ్బరి నూనె, 2 ఉల్లిపాయలు ముక్కలు, 15-20 కరివేపాకు, 10-15 మెంతులు, 10 వెల్లుల్లి రెబ్బలు.
స్టెప్ 1: ఈ పదార్థాలు అన్నిటిని ఒక పాత్రలో కలపాలి.
స్టెప్ 2: ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడకబెట్టండి.
స్టెప్ 3: ఇప్పుడు, దానిని మరిగించి చల్లబరచండి.
స్టెప్ 4: తరువాత వడపోసి, ఆ నూనెను మూత ఉన్న బాటిల్లో పోసి వాడండి.
ALSO READ : అల్లం టీ నుండి మజ్జిగ వరకు
ఉపయోగాలు:
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె చర్మాన్ని బలంగా చేస్తుంది, తలపై ఆరోగ్యకరమైన చర్మాన్ని పెంచుతు, హైడ్రేట్ చేస్తుంది. మీ జుట్టుకు మెరుపు అందిస్తుంది.
ఉల్లిపాయలు: ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని త్వరగా పెంచుతుంది. కొల్లాజెన్ కొత్త, ఆరోగ్యకరమైన చర్మ కణాలను సృష్టిస్తుంది ఇంకా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తు, జుట్టు రాలడాన్ని ఆపేస్తుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి తలకు హాని కలిగించే క్రిములు, బ్యాక్టీరియాను చంపుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే వెల్లుల్లి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇంకా జుట్టు పెరుగుదలను వేగం చేస్తుంది.
కరివేపాకు: యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే కరివేపాకు తలపై చర్మాన్ని శుభ్రపరుస్తుంది అలాగే హైడ్రేట్ చేస్తుంది, చనిపోయిన జుట్టు కుదుళ్లను తొలగించి, మీ జుట్టు పల్చబడకుండా చూస్తుంది.
ఎలా ఉపయోగించాలి:
ఈ నూనెను వారానికి రెండుసార్లు రాసి, 3 గంటల పాటు అలాగే ఉంచి షాంపూతో కడుక్కోండి. ఇలా మూడు నుండి నాలుగు నెలలు పాటిస్తే మంచి ఫలితాలను చూస్తారు.
చెడు ప్రభావాలు : ఉల్లిపాయ నూనె వల్ల దుష్ప్రభావాలు ఏంటంటే జుట్టు పొడిబారడం, తలపై కాస్త చికాకుగా అనిపిస్తుంది, ఇలా అధిక సల్ఫర్ కంటెంట్ వల్ల వస్తుంది. కాబట్టి ఈ దుష్ప్రభావాల గురించి గుర్తుపెట్టుకోండి.