
- సికింద్రాబాద్, గోల్కొండ, డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ వద్ద నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ బుధవారం హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీలలో-మాక్ డ్రిల్ చేపట్టనుంది.
వైమానిక దాడులపై ప్రజలను అప్రమత్తం చేయడం, దాడుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం, యుద్ధ సన్నాహాల్లో పౌరుల పాత్రను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ డ్రిల్ చేపడుతున్నట్లు సివిల్ డిఫెన్స్ ప్రకటించింది. సైరన్ మోగినప్పుడు వాహనదారులు తమ వెహికల్స్ రోడ్డు పక్కన ఆపి, సురక్షిత ప్రదేశంలో ఆశ్రయం పొందాలని చెప్పింది. సైరన్‌ను అనుకరించే ఈ డ్రిల్‌లో పాల్గొని.. పౌరులు యుద్ధ సమయ జాగ్రత్తలను అర్థం చేసుకోవాలని అధికారులు కోరారు.