ప్రతిపక్షాల సమావేశం వాయిదా.. కాంగ్రెస్, డీఎంకే విజ్ఞప్తులే కారణం

ప్రతిపక్షాల సమావేశం వాయిదా.. కాంగ్రెస్, డీఎంకే విజ్ఞప్తులే కారణం

జూన్ 12న పాట్నాలో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్ 23కు వాయిదా పడింది. కాంగ్రెస్, తమిళనాడు మిత్రపక్షం అభ్యర్థన మేరకు తేదీని మార్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ గైర్హాజరీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం USలో ఆరు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయన జూన్ 15 న తిరిగి వస్తారని సమాచారం. అతని తల్లి సోనియా గాంధీ కూడా వైద్య కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నారు. ఆమెతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.

డీఎంకే కూడా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు సమాచారం. జూన్ 12వ తేదీనే రాష్ట్రంలో ఓ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరు కావాల్సి ఉంది. 2024లో బీజేపీని ఢీకొట్టేందుకు విపక్షాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ముందుకొచ్చిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చొరవతో పాట్నాలో సమావేశం జరగనుంది. గత నెలలో రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేతో భేటీ అనంతరం జూన్ 12న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.