ఉస్మానియా ఆసుపత్రిలో రెండునెలల పాప కిడ్నాప్

ఉస్మానియా ఆసుపత్రిలో రెండునెలల పాప కిడ్నాప్

ఉస్మానియా ఆసుపత్రిలో రెండునెలల పాప కిడ్నాప్ కు గురైంది.   తల్లితో పాటే నిద్రిస్తున్న పసికందును గుర్తుతెలియని మహిళ, ఓ బాలుడు ఎత్తుకెళ్లారు. మొదట్లో ఈ కిడ్నాప్ వార్తలను కొట్టిపారేసిన పోలీసులు..ఆ తర్వాత కేసు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళ్తే..

ఉస్మానియా ఆసుపత్రి బయట ఉన్న పుట్ పాత్ పై  కొన్నినెలలుగా ఓ మహిళ తన  రెండు నెలల పసికందు నివసిస్తోంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం ఇక్కడే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున అక్కడే ఉంటున్న మరో మహిళ..ఓ బాలుడు...రెండు నెలల పాపను మాయం చేశారు.  చిన్నారి కనిపించకుండా పైన వస్త్రం కప్పి..అఫ్జల్‌గంజ్‌ చౌరస్తాలో బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత నిద్రలో నుంచి లేచిన మహిళ...తన  బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సీసీ టీవీలో రికార్డు..

పాప కిడ్నాప్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి, అఫ్జల్ గంజ్ పరిసరాల్లోని సీసీ పుటేజీని పరిశీలించారు. పుటేజీలో ఓ మహిళ, ఓ బాలుడు పాపను ఎత్తుకుని వెళ్తున్నట్లు కనిపించింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.