ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.837.08 కోట్లు జమ చేశాం : హౌసింగ్ సీఈ చైతన్య కుమార్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.837.08 కోట్లు జమ చేశాం : హౌసింగ్ సీఈ చైతన్య కుమార్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.837.08కోట్లు జమ చేశామని హౌసింగ్​ సీఈ ఎం.చైతన్య కుమార్​ తెలిపారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పనులను పీడీ రవీంద్రనాథ్​తో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఏడాది12,571.24 కోట్లు బడ్జెట్​లో కేటాయించిందని, ఇప్పటి వరకు 3,14,408 ఇండ్లు సాంక్షన్​ అయ్యాయన్నారు. ఇందులో 80,500 ఇండ్లు ఎస్సీలకు, 54 వేల ఇండ్లు ఎస్టీలకు కేటాయించినట్లు తెలిపారు. 

1.98 లక్షల ఇండ్లు గ్రౌండింగ్​ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూర్, నార్నూర్​ తదితర గిరిజన ప్రాంతాల్లో అదనంగా 22,016 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బెండాలపాడు గ్రామంలో 82 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.3 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. 27 ఇండ్లు కంప్లీట్​ అయ్యాయని చెప్పారు.