- పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి
హసన్ పర్తి, వెలుగు : రైతులు దళారుల బారినపడి నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ , అనంతసాగర్, జయగిరి, దేవన్నపేట గ్రామాల్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఈ ఏడాది ధాన్యం మద్దతు ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఏ–గ్రేడ్రకం క్వింటాల్‌కు రూ.2,389తోపాటు సన్నవడ్లకు బోనస్ రూ.500 ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుగులోతు దివ్యరాణీరాజు, వైస్ చైర్మన్ పాడి మల్లారెడ్డి, ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, కిసాన్ మండల అధ్యక్షుడు వట్టే శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు బండ చంటి రెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
