సేవాభావంతో ఉంటే వయస్సు పెరగదు: పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్

 సేవాభావంతో ఉంటే వయస్సు పెరగదు:  పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్

 

ముషీరాబాద్, వెలుగు: సాహితీ సేవ కళా ప్రక్రియలకు, సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారికి వయస్సు పెరగదని, నిత్య యవ్వనులుగా ఉంటారని ప్రొఫెసర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ చెప్పారు. చేనేత సామాజిక ఉద్యమ జాతీయ నాయకుడు చిక్కా దేవదాస్ ఏండ్లుగా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం సాహితీ సేవా కార్యక్రమాలేనన్నారు.

 బుధవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో కళా నిలయం సాంస్కృతిక సంస్థ, ఓంకార్ సంస్థల ఆధ్వర్యంలో చిక్క దేవదాస్​కు ‘సహస్ర సేవా ధూరేణుడు’ బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొలకలూరి ఇనాక్ ముఖ్యఅతిథిగా పాల్గొని దేవదాస్​ను అభినందించారు. చేనేత కార్మికుల కోసం చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. విద్యావేత్త చందు ఆంజనేయులు మాట్లాడుతూ మనస్సు, మేధస్సు కలిస్తే ప్రతిభ రాణిస్తుందన్నారు. దేవదాస్​ మానవీయత కలవారని ప్రశంసించారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుంకర సత్యనారాయణ, సురేందర్ సంస్థ అధ్యక్షులు పుష్ప తదితరులు పాల్గొన్నారు.