కాలు, రెండు చేతులు లేకున్నా పోలో డ్యాన్స్

కాలు, రెండు చేతులు లేకున్నా పోలో డ్యాన్స్

పుట్టుకతోనే ఒక కాలు, రెండు చేతులు లేవు. ఇటలీకి చెందిన ఫ్రాన్సెస్కా సెసరినికి. సొంతంగా నడవలేదు సరికదా తన పనులు కూడా చేసుకోలేదు. అయితేనేం ఏరోజు బాధ పడలేదు. ఎందుకంటే ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్, ధైర్యం ఆమె సొంతం. తనపై తనకి నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకమే తనని ఈ ఏడాది ‘పారా పోల్ డ్యాన్స్ వరల్డ్ ఛాంపియన్  చేసింది.

ఒకరోజు పొద్దున్నే ఫ్రాన్సెస్కో వాళ్ల అమ్మతో  ‘నేను అక్రోబాటిక్ పోల్ డాన్సర్​ అవ్వాలి అనుకుంటున్నా’ అని చెప్పింది. చేతులు, కాళ్లు ఉన్నవాళ్లకే పోల్​ డాన్స్​ చేయడం కష్టం. అలాంటిది తన కూతురి వల్ల అవుతుందా? అన్నట్టుగా ఆమె ఫ్రాన్సెస్కా వైపు ఆశ్చర్యంగా చూసింది. కానీ, ఫ్రాన్సెస్కా పట్టు వదిలితే కదా! కోచ్​ సాయంతో రోజూ ఇంట్లోనే పోల్​ డాన్స్​ ప్రాక్టీస్​ చేసేది. లోకల్​గా జరిగే దివ్యాంగుల విభాగంలో పోల్​ డాన్స్​ పోటీల్లో పార్టిసిపేట్​ చేసేది.  ఈ ఏడాది ఇంటర్నేషనల్​ పోల్​ స్పోర్ట్స్​ ఫెడరేషన్​ వర్చువల్​ వరల్డ్​ పోల్​, ఏరియల్​ ఛాంపియన్​షిప్​లో పోటీ చేసింది. ఆన్​లైన్​లో జరిగిన ఈ పోటీలకి తన పోల్​ డాన్స్​ వీడియోలు పంపించింది. ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోల్​డాన్సర్లు వీడియోలు పంపించారు. దివ్యాంగుల విభాగంలో పోటీలో నిలిచింది ఫ్రాన్సెస్కా ఒక్కతే. దాంతో ఆమెకే గోల్డ్​ మెడల్​ ఇచ్చారు నిర్వాహకులు. 
అందరిలానే ఎంజాయ్​ చేస్తుంది
ఫ్రాన్సెస్కాకి రెండున్నర ఏండ్ల వయసులో ఆర్టిషియల్​ చేతులు పెట్టారు. అయితే, ఎనిమిదేండ్ల వయసు నుంచి ఆర్టిఫిషియల్ చేతులు పెట్టుకోవడం మానేసింది. తన ఈడు అమ్మాయిల లెక్కనే లైఫ్​ని ఎంజాయ్​ చేస్తుంది ఫ్రాన్సెస్కా. ఫ్రెండ్స్​తో కలిసి మెక్​డొనాల్డ్స్​కు వెళ్తుంది. లేటెస్ట్​ పాప్​ సాంగ్స్​ పాడుతుంది. డాన్స్​ కూడా చేస్తుంది.  అంతేకాదు జేకే. రౌలింగ్​ రాసిన ‘హ్యారీ పోటర్​’ సిరీస్​ పుస్తకాల్ని కూడా ఇష్టంగా చదువుతుంది.