నగలు పాతబడ్డాయా.. ఇలా చేయండి  దగ దగ మెరుస్తాయి..!

నగలు పాతబడ్డాయా.. ఇలా చేయండి  దగ దగ మెరుస్తాయి..!

ఆక్సిడైజ్డ్​​ జువెలరీ ఎక్కువ రోజులు వాడితే రంగు తేలి పోతుంది. దాంతో ఇష్టంగా కొనుకున్న మ్యాచింగ్  జువెలరీని  కాస్త రంగు మారగానే  పక్కన పెడతారు చాలామంది. కానీ అలా పక్కన పడేయకుండా కొన్ని సులువైన  పద్ధతులలో ఆక్సిడైజ్డ్​​ జువెలరీని శుభ్రం చేసుకుని మళ్లీ  వాడుకోవచ్చు. అదెలాగంటే.  

ఇంట్లో గిన్నెలు  శుభ్రం చేసుకోవడానికి  వాడే డిటర్జెంట్, లిక్విడ్​తో  ఆక్సిడైజ్డ్​​​ జువెలరీని  మళ్లీ  మెరిపించొచ్చు. ఒక గిన్నెలో గోరు వెచ్చని నీళ్లు  పోసి డిటర్జెంట్ లేదా లిక్విడ్ వేసి  కలపాలి.  ఆ మిశ్రమంలో ​  కొద్దిసేపు ఆక్సిడైజ్డ్​ జువెలరీ ఉంచితే మురికి  తేలికగా పోతుంది. తర్వాత వేడి నీళ్లలో నుంచి జువెలరీని  బయటకు తీసి   టూత్ బ్రష్​తో  అంచులను శుభ్రం చేయాలి. కొంచెం సేపు మంచి నీళ్లలో ఉంచి పొడి క్లాత్​తో తుడిస్తే  జువెలరీ మెరుస్తుంది.  

టూత్​ పేస్ట్​తో కూడా ఆక్సిడైజ్డ్​​​ జువెలరీని శుభ్రం చేసుకోవచ్చు. కొంచెం టూత్ పేస్ట్​  తీసుకొని బ్రష్​తో జువెలరీ మూలలను రుద్దితే  దుమ్ము వదులు తుంది. ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లలో పది నిమిషాలు ఉంచి పొడి క్లాత్​తో తుడిస్తే  జువెలరీ కొత్తదానిలా మెరిసిపోతుంది.