 
                                    పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో గురువారం నుంచి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాహనదారులను దారి మళ్లించి పంపిస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్గురువారం పనులను పరిశీలించారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, హెచ్‌ఎండీఏ డిప్యూటీ ఇంజినీర్ విద్యాసాగర్ తో సమావేశమై ట్రాఫిక్ సౌకర్యాలపై సమీక్షించారు. బాలంరాయి, అన్ననగర్ చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చూడాలని సూచించారు.

 
         
                     
                     
                    