
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పరమ్ సుందరి’.తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. మడాక్ ఫిలింస్ నిర్మించింది. బుధవారం (జులై30న) ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
రిలీజ్ డేట్‌తో పాటు ‘పరదేశియా’అనే ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో సిద్ధార్థ్, జాన్వీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. నిజానికి జులై 25న సినిమా విడుదల కావల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది.
ఉత్తరాదికి చెందిన ‘పరమ్’,దక్షిణాదికి చెందిన ‘సుందరి’మధ్య జరిగే ప్రేమకథ ఇది. భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు విషయంలో భిన్న ధృవాలైన వీరి పెళ్లి విషయంలో తలెత్తే సమస్యలను వినోదభరితంగా తెరకెక్కించినట్టు మేకర్స్ చెబుతున్నారు.