
సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి ఎక్స్ రోడ్డు నుంచి నిత్యం వందల మంది ప్రయాణికులు కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ కూర్చునేందుకు బస్టాండ్ లేదు. వానొచ్చినా, ఎండకొట్టినా నిలబడాల్సిందే. గంటల కొద్దీ నిరీక్షిస్తే వచ్చే బస్సును ఎక్కలేం.. ఎక్కితే సీటు దొరికేది కష్టమేనని వృద్ధులు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. - సదాశివనగర్, వెలుగు