పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagat singh) గ్లింప్స్ వచ్చేసింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తరువాత పవన్, హరీష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ మూవీ.. చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది.
తాజాగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది మూవీ టీం. మార్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసిన టీం.. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేసి ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఈ గ్లింప్స్ వీడియో పవన్ అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని తెగ ఆకట్టుకుంటోంది. మరోసారి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ లో పవన్ యాక్టింగ్ అండ్ పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంది. మళ్ళీ గబ్బర్ సింగ్ డేస్ గుర్తొచ్చాయి.
మొత్తంగా హరీష్ శంకర్ తన టైప్ ఆఫ్ మాస్ మార్క్ ని ఈ గ్లింప్స్ లో చూపించారు. మరోసారి పోలీస్ పాత్రలో తన పవర్ చూపించడానికి రెడి అయ్యాడు పవన్. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.