
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న రెండో దశ వారాహి విజయ యాత్ర తాడేపల్లిగూడెంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి జగన్ అనర్హుడు కూడా అని విమర్శించారు. జగన్ ఒక సంస్కారహీనుడు అని అన్నారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడితే... జగన్ తన ఇంట్లో కుటుంబ సభ్యులపై ప్రస్తావించడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. అలాగే జనసేన వీర మహిళలను సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేయటం ఏమాత్రం తగదని మండిపడ్డారు.
తాడేపల్లిగూడెంలో సరైన రోడ్లు లేవని ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఎర్రకాలువకి 50గండ్లు పడ్డాయి. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది పూర్తయిపోతుంది. పోలవరాన్ని పూర్తి చేయలేవు. కనీసం ఎర్రకాలువ గండ్లు కూడా పూర్తి చేయలేవా అంటూ సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ విమర్శించారు.ప్రజల బతుకుల మీద చెత్త పన్ను వేసే.నీదొక చెత్త ప్రభుత్వం, నువ్వు చెత్తలో చెత్త ముఖ్యమంత్రివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.