
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తే సీఎం కేసీఆర్కు కోపం వస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కొంతమంది పోలీసులు.. బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీసుపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడాన్ని మహేష్ గౌడ్ ఖండించారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించిన నేతల్ని అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మళ్లీ రాచరిక పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి, బిఆర్ఎస్ ఆఫీస్ ఎట్లా వచ్చిందని ఆయన ఆరోపించారు. మీరు బెదిరిస్తే భయపడే వాళ్లు లేరని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారని మహేష్ గౌడ్ తెలిపారు.