ధరలు పెరిగాయని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

ధరలు పెరిగాయని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
  • రుణమాఫీ హామీ ఇచ్చి 36 లక్షల మంది రైతులను మోసం చేశారు
  • పెద్దగోల్కొండ వద్ద ప్రజా ప్రస్థానంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల

హైదరాబాద్: ఎక్కడకు వెళ్లినా.. ఎక్కడ చూసినా ధరలు పెరిగాయని.. కష్టాలు భరించలేకపోతున్నామని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. తెలంగాణలో కేసీఆర్ పాలన అద్భుతం అంటున్నారు..ఇదేనా అద్భుతం..?  అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శనివారం పెద్దగోల్కొండ వద్ద ప్రజా ప్రస్థానంలో షర్మిల మాట్లాడుతూ రుణమాఫీ హామీ ఇచ్చి 36 లక్షల మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. 
కేసీఆర్ ఆదుకున్నాడని ఒక్కరినైనా చూపగలరా..?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ఫెయిలయ్యారన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. ప్రజా ప్రస్థానయాత్రలో భాగంగా  పెద్ద గోల్కొండలో మహిళలతో ఆమె మాట్లాడుతూ.. ఈ విషయంలో కేసీఆర్ ఆదుకున్నాడని ఒక్కరినైనా చూపగలరా..? అని సవాల్ చేశారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్.. అన్ని రకాల ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాయని.. నిత్యావసర ధరలు పెరిగాయని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటన్నారన్నారు షర్మిల. రెండుసార్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చి మోసపోయారు.. మూడోసారి అవకాశం ఇచ్చే విషయంలో ఆలోచించండని షర్మిల సూచించారు.