‘సర్’లో యాదాద్రి ఫస్ట్..రెండు, మూడు స్థానాల్లో ములుగు, మహబూబాబాద్

‘సర్’లో యాదాద్రి ఫస్ట్..రెండు, మూడు స్థానాల్లో ములుగు, మహబూబాబాద్
  • నియోజకవర్గాల్లో కరీంనగర్​ ఫస్ట్​, ఆలేరు సెకండ్​ 
  • 2002 లిస్ట్​లతో ఈ ఏడాదితో అధికారుల మ్యాచింగ్  
  • ఇప్పటిదాకా యాదాద్రి జిల్లాలో 64.23 శాతం ​కంప్లీట్​

యాదాద్రి, వెలుగు:  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో యాదాద్రి జిల్లాలో స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్​(సర్​) చెకింగ్ ఊపందుకుంది. రెండు నెలల కిందే మ్యాపింగ్​ప్రక్రియ షురువైంది. 2002లో ఓట్​లిస్ట్​తో ప్రస్తుత ఏడాది జాబితాను పోల్చుతున్నారు. అఫీషియల్​గా ఇంకా ప్రకటించలేదు. హైదరాబాద్​లో బీఎల్​వో మీటింగ్​లో జ్ఞానేశ్​కుమార్​తెలంగాణలోనూ సర్​నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ  చేపట్టిన మ్యాపింగ్​లెక్కలు అఫీషియల్​గా బయటకు వచ్చాయి. ఇందులో యాదాద్రి జిల్లా ఫస్ట్..  రంగారెడ్డి జిల్లా చివరలో నిలిచాయి . 2002 లిస్ట్​తో పెద్ద సంఖ్యలో ఓటర్లు మ్యాచ్​కానట్టు ఆఫీసర్ల లెక్కల ద్వారా తెలుస్తోంది. 

23 ఏండ్ల కింద జరగ్గా.. 

2002లో  సర్ నిర్వహించి  ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేశారు.  23 ఏండ్లలో కొన్ని పల్లెలు  పట్టణాలుగా మారాయి.  ఉపాధి, ఉద్యోగాల కోసం ప్రజలు వలస వెళ్లారు. దీంతో ఓటు హక్కు ఒక చోట, నివాసం మరోచోట ఉంది.  కొందరికైతే రెండు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉన్నారనే  అనుమానాలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిణామాలతో పారదర్శకంగా ఓటరు జాబితా కోసమే 'సర్​' చేపడుతున్నామని ఎన్నికల కమిషన్​ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో  ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ జిల్లాలకు పంపించింది. 2025 జాబితా మేరకు  40 ఏండ్లలోపు 3,38,81,253 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40 ఏండ్లలోపువారు1,74,05,716 మంది ఉన్నారు. మండలాల వారీగా ఈ ప్రకియలో 2002 లిస్ట్​లోని ఓటర్ల పేర్లు, ఓటర్​ఐడీ నెంబర్​ఉంటే దాని ప్రకారం... పోలింగ్​స్టేషన్ నెంబర్​ ప్రకారం పోల్చి చూస్తున్నారు. అప్పటి పేర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నాయా..? లేవా..? అని పరిశీలిస్తున్నారు. బీఎల్​వో యాప్​లో అప్​డేట్​చేస్తున్నారు. 

విధుల్లో 35,985 బీఎల్​వోలు

సర్​ప్రకియ కోసం బూత్​ లెవల్​ఆఫీసర్లు (బీఎల్​వో)లు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. 930 మంది ఓటర్లకు ఒక్కో బీఎల్​వోను నియమించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 35,985 మందితో స్వర్వే చేయిస్తున్నారు. 

38.43 శాతం ఓటర్లు మ్యాచ్​ 

23 ఏండ్లలో ఓటరు జాబితా మ్యాచింగ్​ స్పీడ్​గా సాగుతుండగా..  రాష్ట్రవ్యాప్తంగా 38.43 శాతం మ్యాపింగ్​అయింది. అయితే మ్యాచ్​కాని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. ఈ మ్యాపింగ్​లో 64.19 శాతంతో యాదాద్రి జిల్లా మొదటిస్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో ములుగు(58.75), మహబూబాబాద్​(57.20) నిలిచాయి. 

 చివరి రెండు స్థానాల్లో మేడ్చల్​(19.09) రంగారెడ్డి (18.09) ఉన్నాయి.  అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కరీంనగర్​లో 72.01 శాతంతో తొలి స్థానం, ఆలేరు 66.77 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి.  కాగా.. చివరి రెండు స్థానాల్లో ఎల్​బీ నగర్​ (11.39), శేరిలింగంపల్లి 11.39 శాతంలో ఉన్నాయి. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత లిస్ట్​లో ఓటర్లుగా నమోదైన వారి గురించి పరిశీలన ప్రారంభించి ఇంటింటి సర్వే చేస్తారు. 

2002లో ఓటర్లుగా ఉన్నవారి పేర్లు కూడా 'సర్​' లిస్ట్​లో లేవు.  మ్యాచ్​కాని ఓటర్లు ఎన్నికల కమిషన్​సూచించిన గుర్తింపు కార్డుల ద్వారా తమ స్థానికతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ తల్లితండ్రులకు సంబంధించిన గుర్తింపును చూపించాల్సి ఉంది.