- ఇసుక మాఫియానే ఇలా చేసి ఉండొచ్చు
- వాటర్ మ్యాన్ ఆఫ్ఇండియా రాజేంద్ర వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: పెద్దపల్లి జిల్లాల్లోని చెక్‌డ్యామ్‌లను పేల్చివేశారని, తన అనుభవంతో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన తర్వాత ఈ విషయం చెప్తున్నానని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ చెప్పారు. తనుగుల చెక్‌డ్యామ్, అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్ కూలిపోయిన నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీ పరిశీలించిందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
చెక్ డ్యాంలను పరిశీలిస్తే డ్రిల్లింగ్ చేసినట్టు కనిపిస్తున్నదన్నారు. ఇది వరదలకు కూలింది కాదని, ఎలాంటి నీళ్లు లేనప్పుడు కూలిందన్నారు. సాగునీటిపారుదల శాఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ఇంజినీర్ శ్రీధర్‌దేశ్‌పాండే మాట్లాడుతూ.. తనుగుల, సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌లు కావాలనే పేల్చేశారని, అక్కడ రాత్రి పూట పెద్ద సౌండ్స్రావడంతో స్థానికులు పొద్దున అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
నాణ్యతాలోపంతో, ఇతర కారణాలతో కూలిపోయినట్టు కనిపించడం లేదన్నారు. జిలెటిన్‌స్టిక్స్ పెట్టి పేల్చిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయన్నారు. రెండు రోజుల్లోనే రెండు చెక్ డ్యామ్‌లు ఎలా కూలుతాయని ప్రశ్నించారు. ఇసుక మాఫియానే ఈ విధ్వంసం సృష్టించినట్టు తెలిపారు.
