26 రోజుల్లో 19సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

26 రోజుల్లో 19సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

సెప్టెంబర్ 28 నుంచి పెట్రోల్ ధరలు 19 సార్లు పెరిగాయి. గడిచిన మూడు వారాల్లో లీటర్ పెట్రోల్ పై 5 రూపాయల 7 పైసలు పెరిగింది. ఇక సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధరలు 22 సార్లు పెరిగాయి. లీటర్ డీజిల్ పై గడిచిన మూడు వారాల్లోనే 7 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55 పైసలుండగా.. డీజిల్ ధర రూ.104.70గా ఉంది. పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.