ఎండీ, ఎంఎస్ ఫలితాల్లో అవకతవకలు

ఎండీ, ఎంఎస్ ఫలితాల్లో అవకతవకలు
  • ధర్నా చౌక్ లో పీజీ విద్యార్థుల ఆందోళన 

ముషీరాబాద్,వెలుగు: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విడుదల చేసిన ఎండీ, ఎంఎస్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు పీజీ విద్యార్థులు ఆరోపించారు. శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో వారు నిరసన చేపట్టారు. అనుభవం లేని ప్రొఫెసర్లు పేపర్లు దిద్ది అక్రమాలకు పాల్పడ్డారని, ఉత్తమ సమాధానాలకు తక్కువ మార్కులు ఇచ్చారని డాక్టర్ వెంకటేష్ కుమార్ ఆరోపించారు. 

ఒకటి రెండు మార్కుల తేడాతో సుమారు 80 మంది వరకు ఫెయిల్ అయ్యారని తెలిపారు.  వెంటనే ఈ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపి, రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు శ్రీనివాస్ గుప్తా, ముక్రం, కె.పి.ఆర్, ప్రశాంత్ పాల్గొన్నారు.