
పిట్లం, వెలుగు : జాతీయ స్థాయి ట్రైనింగ్క్యాంపులో ప్రతిభ చూసిన పిట్లం బ్ల్యూబెల్స్స్కూల్ విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. గురువారం రాజ్‌భవన్‌కు విద్యార్థులను పిలిపించి గవర్నర్ ఆశీర్వదించారు. మార్చి 24 నుంచి వారం రోజులపాటు భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి ట్రైనింగ్క్యాంపులో పిట్లం బ్లూబెల్స్ స్కూల్ విద్యార్థులు పుట్నాల వాసవి, నీరుడి లోకిత, భోగం సాత్విక, గుడిపల్లి శ్రీనికారెడ్డి, కొండ సంధ్య, కంకరి శ్రావణితోపాటు గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన సీహెచ్సంజన, వడ్ల స్నేహ పాల్గొన్నారు.
క్యాంపులో సైబర్ క్రైం క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, జనరల్ నాలెడ్జ్, బెస్ట్ డిసిప్లిన్ గ్రూప్ అంశాల్లో పిట్లం విద్యార్థులు ప్రతిభ కనబర్చారని రెడ్‌క్రాస్ స్టేట్ ఎంసీ అండ్జేఆర్సీ మెంబర్ డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, రెడ్ క్రాస్ స్టేట్ వైస్‌చైర్మన్ శ్రీరాములు, బ్లూబెల్స్ స్కూల్‌టీచర్ మంగళం ఉన్నారు.