PM Kisan: రైతులకు పీఎం కిసాన్‌ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

PM Kisan: రైతులకు పీఎం కిసాన్‌ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నారు. అయితే  పథకంయొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు e-KYC, భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒక రైతు ఈ-కేవీసీని పొందకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి. పథకం కోసం e-KYC చేసే ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందజేస్తుంది.. ఈ మొత్తం విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రభుత్వం ఏడాదిలో మూడు విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. ఇప్పటి వరకు 16వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను కూడా రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం e-KYC చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత లేదా కొత్త అనే తేడా లేకుండా పథకం లబ్ధిదారులందరూ ఈ పని చేయడం చాలా అవసరం.

ఈకేవైసీని అప్‌డేట్ చేయండిలా..

  • రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాలి.
  • అధికారిక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • తర్వాత "సెర్చ్" బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
  • “గెట్ మొబైల్ OTP” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు ధృవీకరణ కోడ్ వస్తుంది.
  • పోర్టల్‌లో OTPని నమోదు చేసి, ఆపై “Submit for Auth” బటన్‌పై క్లిక్ చేయండి.
  • అలా చేయగానే PM కిసాన్ KYC అప్‌డేట్ పూర్తవుతుంది.

PM కిసాన్ KYC స్థితిని తనిఖీ చేయండి.....కేవైసీ స్టేటస్ తనిఖీ చేయండిలా..

  • PM కిసాన్ KYC స్టేటస్ పేజీని సందర్శించడానికి వెబ్‌సైట్‌లోకి వెళ్లి "క్లిక్ హియర్"అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • అందించిన ఫీల్డ్‌లో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి
  • 'సర్చ్' బటన్‌పై క్లిక్ చేయండి
  • సదరు పేజీ PM కిసాన్ KYC స్థితిని డిస్‌ప్లే చేస్తుంది. ఇది KYC విజయవంతంగా పూర్తయిందా లేదా తదుపరి చర్య అవసరమైతే సూచిస్తుంది.

లబ్ధిదారుడి స్థితిని తనిఖీ చేయండిలా..

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • పేజీకి కుడి వైపున ఉన్న 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. 'డేటా పొందండి' ఆప్షన్ ఎంపిక చేయండి.
  • తద్వారా లబ్ధిదారుడి స్థితి డిస్ ప్లే అవుతుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయండిలా..

  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హోంపేజీలో "PM కిసాన్ లబ్ధిదారుల జాబితా" మెనుపై క్లిక్ చేయండి.
  • ఆప్షన్ల నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, తహసీల్, గ్రామం, బ్లాక్‌ని ఎంచుకోండి.
  • 'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • 2024 PM కిసాన్ 17వ లబ్ధిదారుల జాబితా మీ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.

కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేయండిలా..

వెబ్‌సైట్‌లోకి వెళ్లడానికి ఈ లింక్ క్లిక్ చేయండి
'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయండి.
అవసరమైన వివరాలను నమోదు చేసి, 'అవును' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
PM-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

వీళ్లకు పీఎం కిసాన్​ రాదు

  • మినహాయింపు వర్గానికి చెందిన రైతులు
  • దరఖాస్తు ఫారమ్‌లో IFSC కోడ్ తప్పు
  • పనిచేయని, క్లోజ్​ అయిన బ్యాంకు ఖాతాలు
  • బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్​లింక్​ లేకపోతే 
  • అసంపూర్తి దరఖాస్తు
  • బ్యాంక్​ వివరాలు, పోస్టాఫీసు వివరాలు సక్రమంగా నమోదు కాకపోతే
  • ఆధార్​ నంబర్​ తప్పుగా నమోదు కావడం..