ప్రధాని మోదీకి సభ నడుపస్తలేదు : ఎంపీ మల్లు రవి

ప్రధాని మోదీకి సభ నడుపస్తలేదు : ఎంపీ మల్లు రవి
  • పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండు: ఎంపీ మల్లు రవి 

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల కన్వీనర్ మల్లు రవి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నడిపే ఉద్దేశం ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. ఉదయం సభను వాయిదా వేసి, సాయంత్రం మళ్లీ ప్రారంభించి ముగిస్తున్నారని, ఇదేనా సభను నడిపే పద్ధతని ప్రశ్నిం చారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వశ్చన్ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం ప్రశ్నలు అడిగే సమయం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ మీడియాతో ఆయన మాట్లాడారు. 

ప్రజల కోసం తీసుకొచ్చే బిల్లులపై ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుంటే.. ఇదేం ప్రజాస్వామ్యమని ఫైర్ అయ్యారు. ఇంతటి నియంతృత్వ పాలన రాజుల కాలంలోనూ చూడలేదన్నారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ రాహుల్ గాంధీతోనే సాధ్యమన్నారు.