ఢిల్లీ నుంచే యూర‌ప్లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్ర‌ధాని

ఢిల్లీ నుంచే యూర‌ప్లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్ర‌ధాని

5జీ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి యూరప్లోని కారును ప్రధాని నరేంద్రమోడీ టెస్ట్ డ్రైవ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సాయంతో స్వీడన్లోని కారును ఆయన ఎరిక్సన్ స్టాల్లో ఉండి నడిపారు. ప్రధాని మోడీ టెస్ట్ డ్రైవ్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

యూరప్ లోని స్వీడన్లో ఓ ఇండోర్ కోర్స్ లో కారు ఉంచారు. దాని నావిగేషన్ కంట్రోల్ సెటప్  ఢిల్లీలోని ఎరిక్సన్ స్టాల్ లో ఏర్పాటు చేశారు. కంట్రోల్ సీట్ పైన కూర్చున్న మోడీ హ్యాండిల్ పట్టుకుని యాక్సెలేటర్, బ్రేక్ లను ఉపయోగిస్తూ కార్ డ్రైవ్ చేశారు. ఇదిలా ఉంటే భారత్ లో 5జీ సేవలు ప్రధాని లాంఛనంగా ప్రారంభించడంతో యూజర్లు దీపావళి నుంచి 5జీ సేవలను పొందనున్నారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికి దేశం న‌లుమూల‌లా అన్ని ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో జియో సేవ‌లు ప్రారంభిస్తామ‌ని ముఖేష్ అంబానీ ప్రకటించారు.