జనవరి 10 నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్

జనవరి 10 నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్

జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడి.  జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ..ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. దేశంలోనూ ఒమిక్రాన్  వ్యాపిస్తోందన్నారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.  ప్రజలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలన్నారు. ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు ఇబ్బందిపడుతున్నాయన్నారు. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. దేశంలో 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 4లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా 90 వేలకు పైగా బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.  దేశంలో గత జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైందన్నారు. దేశంలో అర్హులైన 61 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. త్వరలో దేశంలో నాసల్ వ్యాక్సిన్,డీఎన్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందన్నారు. త్వరలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి  జనవరి  3 నుంచి వ్యాక్సిన్ అమలు చేస్తామన్నారు. జనవరి 10 నుంచి  హెల్త్ కేర్ ,ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ వేస్తామన్నారు. 60 ఏళ్ల పై వారు ,ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు బూస్టర్ డోసు తీసుకోవచ్చన్నారు.