Akanksha Dubey case: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది.. నటి మరణంలో అతనెవరు?

Akanksha Dubey case: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది.. నటి మరణంలో అతనెవరు?

ఆత్మహత్యకు పాల్పడిన భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా'తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల నటి వారణాసిలోని సారనాథ్ ప్రాంతంలోని సోమేంద్ర రెసిడెన్సీ హోటల్ గదిలో మార్చి 26న శవమై కనిపించింది. ఆమె లైక్ హూన్ మై నాలైక్ నహిన్ సినిమా షూటింగ్ కోసం షూటింగ్ కోసం వచ్చిన ఆకాంక్ష... విగత జీవిగా ప్రత్యక్షమైంది. ఈ కేసులో ఇప్పటికే సింగర్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ పై కేసు నమోదైంది. అయితే ఆమె చనిపోవడానికి ముందు 17 నిమిషాలు ఏం జరిగింది.. ? ఎందుకు చనిపోయింది..? అన్న విషయంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. 

ఆకాంక్ష ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె హోటల్ గదిలో దింపడానికి ఆమెతో పాటు ఓ వ్యక్తి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఆమెతో హోటల్ గదిలోకి ప్రవేశించి, దాదాపు 17 నిమిషాలు గడిపినట్టు స్పష్టం చేశారు.

హోటల్ గదిలో సూసైడ్ నోట్ దొరకలేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త పరిణామంలో, ఆ ప్రాణాంతక రాత్రి ఆకాంక్ష దూబేని ఆమె హోటల్ గదిలో దింపడానికి ఒక వ్యక్తి వచ్చాడని కనుగొనబడింది. అతను ఆమెతో దాదాపు 17 నిమిషాల పాటు ఆమె గదిలో గడిపాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ 17 నిమిషాలు హోటల్ గదిలో ఏం జరిగింది.. అతను, ఆమెతో ఏం మాట్లాడాడు. వాళ్లిద్దరి మధ్య ఏమైనా వాగ్వాదం చోటుచేసుకుందా అన్న విషయాలను మాత్రం పోలీసులు ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఈ కేసులో హోటల్ సిబ్బందిని సంప్రదించినా వారు సైతం ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు. సీసీటీవీ ఫుటేజీ పోలీసుల అదుపులో ఉందని మాత్రం వారు పేర్కొన్నారు.

ఈ కేసులో ఆకాంక్ష దూబే తల్లి మధు దూబే తన కుమార్తె మరణానికి ఇద్దరు వ్యక్తులను బాధ్యులను చేస్తూ ఫిర్యాదు చేశారు. మార్చి 21న సింగర్ సమర్ సింగ్ సోదరుడు సంజయ్ సింగ్ ఆకాంక్ష దూబేని చంపేస్తానని బెదిరించాడని, ఆ విషయాన్ని ఆకాంక్ష స్వయంగా తనకు ఫోన్ ద్వారా తెలియజేసిందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం బృందాలుగా ఏర్పడి వివిధ చోట్ల దాడులు చేస్తున్నారు. 

ఆకాంక్ష దూబే పోస్ట్‌మార్టం నివేదిక

నగరంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో ఆకాంక్ష దూబే పోస్టుమార్టం కొంత ఆలస్యం కానుంది. రిపోర్ట్ రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆకాంక్ష ఉరివేసుకోవడంతోనే చనిపోయిందని తెలుస్తోంది. అంటే ఆమెది హత్య కాదు ఆత్మహత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు,