బీ కేర్ ఫుల్.. ఎనీ టైం..ఎనీ ప్లేస్.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

బీ కేర్ ఫుల్.. ఎనీ టైం..ఎనీ ప్లేస్.. డ్రంక్ అండ్  డ్రైవ్ టెస్టులు

హైదరాబాద్ లో మందు ప్రియులు అలర్ట్. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వారికి  పోలీసులు ఝలక్ ఇవ్వబోతున్నారు. డేలో  హాయిగా పార్టీలకు అటెండ్ అవ్వొచ్చు.. మందుకొట్టి డ్రైవ్ చేసినా ఎవరూ డ్రంక్ అండ్  డ్రైవ్ టెస్టులు చేయరని ధీమాగా ఉండకండి. ఎందుకంటే.. ఇక నుంచి హైదరాబాద్ లో ఎప్పుడుపడితే అపుడు..ఎక్కడ పడితే అక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేగాకుండా బ్రీత్ ఎనలైజర్ టెస్టులో  30 ఎంజీ వచ్చినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. 

హైద్రాబాద్  ట్రాఫిక్ ఆడిషినల్ డీసీపీ రామదాసు ఏమన్నారంటే.?  హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా డ్రంకెన్  డ్రైవ్ నిర్వహించాం.  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఆదేశాలతో ఈ మెగా డ్రంక్ ఎండ్ డ్రైవ్  నిర్వహించాం.  కేవలం రాత్రి వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారనే ధ్యాసలో ప్రజలు ఉన్నారు.   ఇక నుంచి  ఎనీ టైం, ఎనీ ప్లేస్ లో  డ్రంకెన్  డ్రైవ్ తనిఖీలు చేస్తాం.  హైద్రాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు అరికట్టే విదంగా చర్యలు తీసుకుంటున్నాం.  మద్యం సేవించినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోతారు.  మద్యం మత్తులో రాష్  డ్రైవింగ్ వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు.  

►ALSO READ | వాహనదారులు అలర్ట్..ఆ మూడు రోజులు సికింద్రాబాద్ వైపు వెళ్లకండి

దేశ వ్యాప్తంగా 2024 లో రోడ్డు  ప్రమాదాల వల్ల లక్షా 80 వేల మంది చనిపోయారు.  అందులో 40 శాతం డ్రంకెన్  డ్రైవ్ కారణంగా జరిగాయి. 13వేల మంది ఏడాదిలో డ్రంకెన్ డ్రైవ్ వల్ల మరణిస్తున్నారు.అందుకే ఇక నుంచి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో 30 mg కంటే ఎక్కువ వస్తే చర్యలు తీసుకుంటాం. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వరుసగా పట్టుబడితే కట్టిన చర్యలు తీసుకుంటాం. యువత డ్రంక్ ఎండ్ డ్రైవ్ లో వరుసగా దొరికి జీవితాలు నాశనం చేసుకోవద్దు.  స్కూల్ బస్ డ్రైవర్ లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతునట్లు సమాచారం ఉంది.  స్కూల్ బస్ డ్రైవర్ ల పై కూడా రెగులర్ తనిఖీలు చేస్తున్నాం.  హైద్రాబాద్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర వాటిపై ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు.