ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు ప్రభాకర్ రావు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..  హైదరాబాద్కు ప్రభాకర్ రావు!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటినుండి అజ్ఞతంలో ఉన్న మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆమెరికా నుండి రేపు అనగా 2024 ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు.  

ప్రభాకర్ ను విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది.  ప్రభాకర్ రావు విచారణ అనంతరం బి అర్ ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.  కాగా ఇప్పటికే  ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాళ్లిద్దరినీ శనివారం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి హోంశాఖ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. 

ALSO READ | ఈవీఎంలు, సోషల్ మీడియా లేకుండా.. బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు: రాహుల్ గాంధీ

ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్‌‌ బ్రాంచ్‌‌ (ఎస్‌‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌రావును ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్‌‌ చేశారు. ప్రస్తుతం ప్రణీత్‌‌రావు, రాధాకిషన్ రావు చంచల్‌‌గూడ జైలులో ఉండగా.. భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీలో ఉన్నారు.