Prabhas: 'ది రాజా సాబ్' వెనుక వివాదం. . విడుదల వాయిదాకి కారణం చెప్పిన నిర్మాత!

 Prabhas: 'ది రాజా సాబ్' వెనుక వివాదం. .  విడుదల వాయిదాకి కారణం చెప్పిన నిర్మాత!

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. ఈ మూవీపై అభిమానులకు ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఈ పాన్-ఇండియా హారర్-కామెడీ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచగా,.. లేటెస్ట్ గా చిత్ర నిర్మాత విడుదల ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.

ఆలస్యానికి అసలు కారణం ఇదేనా!

 అయితేఈ హారర్ సినిమా రిలీజ్ పదే పదే వాయిదా పడటంతో .. దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.  ప్రభాస్ వరుస సినిమా బిజీ షెడ్యూల్ కారణంగానే ఆలస్యమవుతుందని చాలా మంది భావించారు. కానీ లేటెస్ట్ గా ఈ చిత్ర నిర్మత టీజీ విశ్వప్రసాద్ అసలు విషయాలు వెల్లడించారు. 'ది రాజా సాబ్' ఆలస్యం కావడానికి షూటింగ్ సమస్యలు కాదని, ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విభాగంలో ఏర్పడిన సమస్యలే కారణమని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణం కోసం నియమించిన సీనియర్ VFX సూపర్‌వైజర్ పని తీరు సరిగా లేకపోవడమే ఈ జాప్యానికి కారణమని ఆయన తెలిపారు.

వివాదంలో VFX సూపర్‌వైజర్

నిజానికి ఈ చిత్రాన్ని  ఏప్రిల్ 2025లో విడుదల చేయాలనుకున్నట్లు విశ్వప్రసాద్ వెల్లడించారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేయకపోవడంతో రిలీజ్ లేట్ అయిందనన్నారు.  దీని కోసం పని చేస్తున్న సూపర్‌వైజర్ సరిగ్గా వర్క్ చేయకుండా ప్రతి నెలా డబ్బులు తీసుకుంటూ..  పురోగతి గురించి అడిగితే సినిమా నుండి తప్పుకుంటానని బెదిరించాడని ఆరోపించారు. ఇదే వ్యక్తిని ఇటీవల ఎస్.ఎస్. రాజమౌళి కూడా తమ తదుపరి ప్రాజెక్ట్ (SSMB 29) నుండి తొలగించినట్లు హింట్ ఇచ్చారు విశ్వప్రసాద్. ఈ హింట్ ఆధారంగా..  నెటిజన్లు ఆ VFX సూపర్‌వైజర్ కమల్ కణ్ణన్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కమల్ కణ్ణన్ గతంలో 'బాహుబలి 2', 'మగధీర' వంటి చిత్రాలకు పని చేశారు.

►ALSO READ | Rishab Shetty: బెంగుళూరు నుంచి మకాం మార్చిన రిషబ్ శెట్టి! ఫ్యామిలీని షిఫ్ట్ చేయడానికి కారణం ఇదే!

దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక ప్రత్యేక ఇన్-హౌస్ VFX విభాగాన్ని ఏర్పాటు చేసింది.  ఇదే టీమ్ ఇటీవల విడుదలైన'మిరాయ్' చిత్రానికి పనిచేసింది. ప్రస్తుతం 'ది రాజా సాబ్' పనులను వేగవంతం చేసినట్లు విశ్వప్రసాద్ వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం..  ఇప్పుడు జనవరి 9, 2026 న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ ఈసారి దెయ్యాలతో చేసే రొమాంటిక్ హంగామా చూడాలంటే అభిమానులు కొన్నాళ్లు వేచి చూడక తప్పదు మరి..