ఏడాది థీమ్ వసుధైక కుటుంబం

 ఏడాది థీమ్ వసుధైక కుటుంబం

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న జీ20 ప్రెసిడెన్సీ థీమ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం వెల్లడించారు. 'వసుధైక కుటుంబం-–ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే ఫ్యూచర్'ను జీ20 ప్రెసిడెన్సీ థీమ్ గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ థీమ్ అన్ని దేశాల స్థిరమైన, సమగ్రమైన సమ్మిళిత అభివృద్ధికి గ్లోబల్ రోడ్‌‌ మ్యాప్ అని ముర్ము అభివర్ణించారు. 

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌‌లో ఉన్న అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ కాంప్లెక్స్ అయిన భారత్ మండపంలో 18వ జీ20 సమిట్ జరుగుతోంది. ఈ సందర్భంగా సమిట్​కు హాజరయిన సభ్య దేశాలకు, గెస్ట్ కంట్రీస్​కు, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులందరికీ ముర్ము వెల్కమ్ చెప్పారు. సమిట్‌‌లో  పాల్గొనే దేశాలన్నీ  అభివృద్ధి కోసం చేసే  ప్రయత్నాల్లో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.