
హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ శీతాకాల విడిది ముగిసింది. ఆమె తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర పతి ముర్ముకు గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాద్, పలువురు ఉన్నతాధికారులు హకీంపేట ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికారు.
డిసెంబరు 18న శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు.. విడిది ముగించుకొని శనివారం ఆమె హైదరాబాద్ నుంచి జైపూర్‌కు వెళ్తారు. ఆనవాయితీలో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.