ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశం

V6 Velugu Posted on Jul 21, 2021

హైదరాబాద్:మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. మెజారిటీ ప్రజలు పూజించే హిందు దేవతల పట్ల  విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేయించారంటూ కరీంనగర్ కు చెందిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గత ఫిబ్రవరి 16న పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేస్తే పట్టించుకోలేదని మార్చి 22న లోకల్ కోర్టులో పిటిషన్  వేశారు. ఈ కేసులో ఆర్ యస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్.హెచ్.ఓకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 19న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన దరఖాస్తును రాష్ట్ర సర్కారు ఒక్కరోజులోనే ఆమోదించింది. ఆ తర్వాత ఒక్కరోజులోనే ఆయనపై పాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలన్న ఆదేశాలు వచ్చాయి.

Tagged , IPS Officer RS Praveen Kumar, orders to book case, Karimnagar advocate Bethi Mahendar Reddy, Principal Judicial First Class Magistrate Saisudha, applied for VRS

Latest Videos

Subscribe Now

More News