వాణిజ్య పన్నుల శాఖలో..21 మంది డిప్యూటీ కమిషనర్లకు కొత్త పోస్టింగ్‌‌‌‌లు : ఎం. రఘునందన్ రావు

వాణిజ్య పన్నుల శాఖలో..21 మంది డిప్యూటీ కమిషనర్లకు కొత్త పోస్టింగ్‌‌‌‌లు : ఎం. రఘునందన్ రావు
  •     రెవెన్యూ శాఖ సెక్రటరీ  రఘునందన్ రావు ఉత్తర్వులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్)లో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలో పనిచేస్తున్న 21 మంది డిప్యూటీ కమిషనర్లకు వివిధ డివిజన్లలో పోస్టింగ్‌‌‌‌లు కల్పిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు జీవో విడుదల చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఉత్తర్వుల ప్రకారం.. ఎ. నాగలక్ష్మిని మాదాపూర్ ఎస్‌‌‌‌టీయూ-(స్టేట్ ట్యాక్సేషన్ యూనిట్)2కు, డి. ఆంజయ్యను సికింద్రాబాద్ ఎస్‌‌‌‌టీయూ-1కు, డి. గోవర్ధన్‌‌‌‌ను కరీంనగర్ ఎస్‌‌‌‌టీయూకు, జి.జె.ఎస్. ప్రవీణను చార్మినార్ ఎస్‌‌‌‌టీయూ-2కు, కె. వెంకటేశ్వర్లును హైదరాబాద్ రూరల్ ఎస్‌‌‌‌టీయూ-2కు, ఎన్. శ్రీనివాస రావును సంగారెడ్డి ఎస్‌‌‌‌టీయూకు, ఎస్. గిరిధర్‌‌‌‌ను అబిడ్స్ ఎస్‌‌‌‌టీయూ-2కు, డి. శ్రీలక్ష్మిని బేగంపేట్ ఎస్‌‌‌‌టీయూ-2కు, జి. జలశ్రీని పంజాగుట్ట ఎస్‌‌‌‌టీయూ-2కు, గోమతి రచకొండను సికింద్రాబాద్ ఎస్‌‌‌‌టీయూ-2కు, సుష్మ వైద్యంను పంజాగుట్ట ఎస్‌‌‌‌టీయూ-3కు కేటాయించారు. 

అదనంగా ఎస్. రవిచంద్రను అబిడ్స్ ఎస్‌‌‌‌టీయూ-3కు కేటాయిస్తూనే అబిడ్స్ ఎస్‌‌‌‌టీయూ-1 ఎఫ్‌‌‌‌ఏసీగాను, పి. ధనలక్ష్మిని బేగంపేట్ ఎస్‌‌‌‌టీయూ-1కు కేటాయిస్తూ ఎస్‌‌‌‌టీయూ-3 ఎఫ్‌‌‌‌ఏసీగాను అదనపు బాధ్యతలు అప్పగించారు.