- శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్
- శ్రీరాంపూర్‌లో సింగరేణి కంపెనీ లెవల్ అథ్లెటిక్స్ పోటీలు షురూ
- సంస్థ 11 ఏరియాలకు చెందిన 250 మంది క్రీడాకారులు హాజరు
కోల్‌బెల్ట్,వెలుగు: కోలిండియా స్థాయి క్రీడల్లో సింగరేణి ఉద్యోగులు సత్తా చాటి సింగరేణికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకరావాలని శ్రీరాంపూర్ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ఏరియా శాంతి మైదానంలో వర్క్స్పీపుల్స్స్పోర్ట్స్అండ్గేమ్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ లెవల్అథ్లెటిక్స్, త్రోబాల్, స్విమ్మింగ్పోటీలను ప్రారంభించారు. ముందుగా ఒలంపిక్ పతాకాన్ని జీఎం ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తూ క్రీడల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడాభివృద్ధికి గ్రౌండ్లు, స్టేడియాలు, సీఈఆర్ క్లబ్లులు స్విమ్మింగ్ పూల్స్ వంటి సదుపాయాలను కల్పించిందని, యువ క్రీడాకారులు ముందుకు రావాలని సూచించారు.
అనంతరం క్రీడాకారులను జీఎం,ఆఫీసర్లు పరిచయం చేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో సుదీర్ఘకాలం క్రీడలను ప్రోత్సాహిస్తున్న సింగరేణి ఎస్వోటుజీఎం ఎన్.సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. రెండు రోజుల పాటు నిర్వహించే కంపెనీ లెవల్పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 250 మంది క్రీడాకారులు ఆరు జట్లుగా పాల్గొంటున్నారు. పురుషులకు21 క్రీడాంశాల్లో , మహిళలకు 12 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో ఎన్. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) ఎస్.అనిల్ కుమార్, ఆర్‌కే-5 గని ఏజెంట్ శ్రీధర్, డిప్యూటీ సీఎంఓ పి. రమేష్ బాబు, స్పోర్ట్స్ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు చాట్ల అశోక్, జాన్ వెస్లీ, గుర్తింపు సంఘం లీడర్లు, కో – ఆర్డినేటర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
తొలిరోజు క్రీడాంశాల్లో 200 మీటర్ల రన్నింగ్ లో ఫస్ట్ బి.రాము(భూపాలపల్లి), సెకండ్ బి.శ్రీనివాస్(బెల్లంపల్లి),400 మీటర్ల రన్నింగ్‌లో కె.రమేశ్(మందమర్రి), ఎ.ఆదిత్యా(ఆర్జీ–3),800 మీటర్ల పోటీలో పి.క్రాంతికుమార్(మందమర్రి),1500 మీటర్ల రన్నింగ్‌లో వి.వినయ్(కొత్తగూడెం),ఎస్.క్రాంతికుమార్(మందమర్రి),5వేల మీటర్ల రన్నింగ్‌లో తొలిస్థానంలో పి.వెంకటేశ్(ఆర్జీ–3),పి.అవినాష్(శ్రీరాంపూర్),110 మీటర్ల హార్డిల్స్ అంశంలో ఆర్.నవీన్‌కుమార్(శ్రీరాంపూర్),కె.జితేందర్(ఆర్జీ–3, భూపాలపల్లి),100×4రిలే అంశంలో బి.తులసీరాం(శ్రీరాంపూర్) గ్రూప్,కె.రమేశ్(మందమర్రి, బెల్లంపల్లి) గ్రూప్,ట్రిపుల్‌జంప్‌లో ఎ.రాకేశ్(ఆర్జీ–3), ఇ.ప్రవీణ్‌కుమార్(ఆర్జీ–1),పోల్‌వాల్ట్‌లో బి.కిషన్(శ్రీరాంపూర్),తిరుపతి(ఆర్జీ–2),షాట్‌ఫుట్‌లో కె.రమేశ్(శ్రీరాంపూర్),ఎస్.వేణుగోపాల్(ఆర్జీ1,2),జావెలిన్ త్రోలో కె.రమేశ్(శ్రీరాంపూర్),ఎం.పుల్లయ్య(ఆర్జీ–3),హ్యామర్‌త్రోలో ఎస్.శ్రీనివాస్‌రెడ్డి(భూపాలపల్లి),కె.రమేశ్(శ్రీరాంపూర్),డిస్కస్‌త్రోలో టి.ప్రశాంత్(శ్రీరాంపూర్),ఎస్.వేణుగోపాల్(ఆర్జీ1,2), ఆర్చరీలో ఎన్.నిఖిల్(ఆర్జీ–2),కె.సత్యనారాయణ(ఆర్జీ–3,భూపాలపల్లి)లు విజయం సాధించారు.
మహిళల విభాగంలో విజేతలు వీరే..
200 మీటర్ల రన్నింగ్‌లో ఫస్ట్ ఏసురాణి(కొత్తగూడెం), సెకెండ్ ఎం.విజయలక్ష్మి(మందమర్రి),400 మీటర్ల రన్నింగ్‌లో ఎం.విజయలక్ష్మి(మందమర్రి),ఎస్ కే రిజ్వానా(కొత్తగూడెం),800మీటర్లలో బి.దుర్గా(మణుగూరు), ఆర్.దివ్యా(శ్రీరాంపూర్)లాంగ్‌జంప్‌లో ఇ.సంధ్యారాణి (కొత్తగూడెం), సీహెచ్.శ్రీయ(మణుగూరు),షాట్‌ఫుట్‌లో బి.కవిత(మందమర్రి),సీహెచ్.సాయిలత(ఆర్జీ–1),జావెలిన్ త్రోలో బి.కవిత(ఎల్లందు),జె.రమణ(ఆర్జీ–3),హ్యామర్‌త్రోలో బి.కవిత(ఎల్లందు),కుసుమ స్వరూప(ఆర్జీ1)డిస్కస్‌త్రోలో పి.శ్వేత(ఆర్జీ3),కుసుమ స్వరూప(ఆర్జీ1),4×100మీటర్ల రిలేలో ఉదయశ్రీ గ్రూప్(భూపాలపల్లి),విజయశాంతి గ్రూప్(మందమర్రి) గెలిచారు.
