నల్గొండ కలెక్టర్ గా చంద్రశేఖర్..నిజామాబాద్ కు ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టర్ గా చంద్రశేఖర్..నిజామాబాద్ కు ఇలా త్రిపాఠి
  • జీహెచ్ఎంసీకి అదనపు కమిషనర్లు
  • పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: పలువురు ఐఏఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల కలెక్టర్ల తోపాటు జీహెచ్ఎంసీలోనూ అధికారులకు స్థానచ లనం కల్పించారు. బదిలీ అయిన అధికారులు తక్ష ణమే కొత్త విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. 

సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉన్న చంద్రశేఖర్ బడుగును నల్గొండజిల్లాకలెక్టర్గా నియమించింది. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. తాండూరు సబ్ కలెక్టర్ గా ఉన్న ఉమా శంకర్ ప్రసాద్ను నారాయణపేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్చార్జి బాధ్యత ల్లో నియమించారు.

జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఐఏఎస్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. నిజామాబాద్ కలెక్టర్ ఉన్న టి. వినయ్ కృష్ణారెడ్డిని జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్గా (మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు) బదిలీ చేశారు. అలాగే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఉన్న జి.సృజనను కూడా జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (క్రూక ట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) నియ మించారు. సృజన బదిలీతో ఖాళీ అయిన పంచాయ తీరాజ్ శాఖ డైరెక్టర్ బాధ్యతలను ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న శృతి ఓజాకు (అదనపు బాధ్యతలు) అప్పగించారు.