Nayanthara TOXIC: పాన్ ఇండియా స్క్రీన్‌పై యశ్–నయనతార.. స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టిన లేడీ సూపర్ స్టార్

Nayanthara TOXIC: పాన్ ఇండియా స్క్రీన్‌పై యశ్–నయనతార.. స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టిన లేడీ సూపర్ స్టార్

పాన్‌‌ ఇండియా స్టార్‌‌‌‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్‌‌’. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుంది. KVN ప్రొడక్షన్స్‌‌ నిర్మిస్తున్న ఈ మూవీకి యశ్‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2026 మార్చి 19న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ఇప్పటికే, టాక్సిక్‌‌ ఫస్ట్ లుక్ పోస్టర్,గ్లింప్స్ రిలీజ్ చేయడంతో భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. 

ఇటీవలే, టాక్సిక్ నుండి బాలీవుడ్‌‌‌‌లో క్రేజీ స్టార్ హుమా ఖురేషి పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె ఎలిజిబెత్‌‌‌‌గా కనిపించనుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా యశ్ సరసన నటించబోయే ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార లుక్ రివీల్ చేశారు. టాక్సిక్లో నయనతారను "గంగ"గా పరిచయం చేస్తూ క్రేజీ పోస్టర్ పంచుకున్నారు.

క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ పేరుకు భిన్నంగా నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఆసక్తిగా ఉంది. గ్లామరస్ డ్రెస్‌లో స్టైలిష్‌గా నిలబడి ఉన్న నయనతార లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్ర. పేరు సింపుల్‌గా ఉన్నా, ఆమె క్యారెక్టర్‌లో స్ట్రాంగ్ ఎమోషన్స్, మిస్టరీ, ఇంటెన్స్ షేడ్స్ ఉంటాయని టాక్. యశ్ పాత్ర జీవితాన్ని మార్చే వ్యక్తిగా ఆమె ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

నయనతార 2026 సినిమాలు:

హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్స్‌‌‌‌తో దూసుకెళుతోంది నయన్. ‘టాక్సిక్‌‌‌‌’ తో పాటుగా తెలుగులో చిరంజీవి సరసన 'మన శంకర వరప్రసాద్ గారు', బాలకృష్ణతో "NBK111", మలయాళంలో మోహన్ లాల్ తో ఓ మూవీ, మహాశక్తి 2 (మూకుతి అమ్మన్ 2), డియర్ స్టూడెంట్స్ వంటి తదితర సినిమాలు చేస్తోంది. 

టాక్సిక్ కథ..

ఈ మూవీ గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ చుట్టూ నడిచే యాక్షన్-ప్యాక్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.1950ల నుంచి 1970ల మధ్య కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కనుంది. అందుకు తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ రిలీజ్ చేసిన పోస్టర్స్, విజువల్స్లో కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా ‘టాక్సిక్’ ఒక డార్క్, ఇంటెన్స్ పాన్‌ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా. సమాజంలో లోతుగా పాతుకుపోయిన పవర్, హింస, లోభం, మానవ బలహీనతలు అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని బలమైన టాక్. ముఖ్యంగా క్రైమ్, రాజకీయాలు, అండర్‌వల్డ్ నెట్‌వర్క్ వంటి అంశాలు చర్చించనున్నారు.

గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్తో పాటుగా కియారా అద్వానీ, హుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.