హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారు

హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారు

హనుమకొండలో అల్లరిమూకలు రెచ్చిపోయారు. అర్థరాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి సృహ కోల్పోయిన బాధితుడిని రోడ్డుపై వదిలి పరార్ అయ్యారు. గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్యామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుడి భార్య మీనా హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అల్లరిమూక దాడి చేసిన సీసీ కెమెరా దృశ్యాలు బయటపడ్డాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను సంపతీ రాహుల్, వర్షిత్, పున్నం చందు, అన్వేష్, ప్రణయ్‎గా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. మరో నిందితుడు అరవింద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శ్యామ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.