పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్ లో మంగళవారం రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయి. తొలి రోజు స్థానిక తహసీల్దార్వెంకటస్వామి, ఎంఈవో భిక్షపతి, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఇందులో 33 జిల్లాల నుంచి 66 టీంలు మెన్, ఉమెన్లు పాల్గొన్నట్లుఅసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు, కార్యదర్శి ఐలయ్య తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న స్పోర్ట్స్ కోటాను వినియోగించుకునేందుకు క్రీడాకారులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి, స్కూల్చైర్మన్రాచకొండ అశోకా చారి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మనోజ్ గౌడ్, టీచర్లు మహేందర్, ఏవో బైరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
