- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత శీతాకాల సమావేశాలను కనీసం పది రోజులపాటు నిర్వహించాలని, సభకు సంబంధించిన ఎజెండాను ముందుగానే అందించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అప్పుడు మాత్రమే సభ్యులు ప్రిపేర్ అయ్యేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ‘‘శాసనసభను మొత్తంగా ఏటా కనీసం 50 రోజుల పాటు నిర్వహించాలి.
శాసనసభకు సంబంధించి అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలి. స్థాయి సంఘాల(స్టాండింగ్ కమిటీల) ఏర్పాటుకు చొరవ చూపాలి. మహాత్మాగాంధీ నరేగా పునరుద్ధరించాలి’’అని పేర్కొన్నారు.
