ఇరగదీద్దాం సంక్రాంతి.. వెంకీ, చిరు సాంగ్ రివ్యూ.. పాట ఎలా ఉందంటే..

ఇరగదీద్దాం సంక్రాంతి.. వెంకీ, చిరు సాంగ్ రివ్యూ.. పాట ఎలా ఉందంటే..

టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేసి అభిమానుల్లో జోష్‌‌‌‌‌‌‌‌ని నింపారు.  చిరు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ ఓ ఇంటరెస్టింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంపార్టెంట్ సీన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు  వీరి కాంబోలో ఓ పాటను కూడా చిత్రీకరించారు. న్యూ ఇయర్ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌గా   మంగళవారం ఈ మెగా విక్టరీ మాస్  సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటలో చిరు, వెంకీ హై ఎనర్జీతో డ్యాన్స్ చేశారు.

‘మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైంటీ.. ఎవడైతే ఏంటీ.. కుమ్మేద్దాం చంటి..   ఏ వెంకీ ఇచ్చేయ్ ధమ్కీ..  ఏ స్పీడేమో ఫైవ్ జీ.. స్టైల్‌‌‌‌‌‌‌‌ ఏమో జెన్‌‌‌‌‌‌‌‌జీ.. వారెవ్వా సర్ జీ.. వుయ్ ఆర్ సో క్రేజీ.. ఏ బాసూ.. పెంచేయ్ బేసు.. ఇంకేంటి బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. అరె ఏందీ వెంకీ సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి.. భయ్యా నువ్వు నెక్స్ట్ లెవల్.. బ్రో నువ్వే బెస్ట్ లెవల్.. యూ అండ్ మీ వేరే లెవల్.. ఇద్దరమొస్తే  పీక్స్ లెవల్.. ’ అంటూ  ఫెస్టివల్ వైబ్‌‌‌‌‌‌‌‌తో సాగిన పాట ఆకట్టుకుంది.

కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా, నక్ష్ అజీజ్, విశాల్ దద్లాని ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌గా పాడారు. విజయ్ పొలాకి కొరియోగ్రఫీలో చిరు, వెంకీల డ్యాన్స్ మూమెంట్స్, పబ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లోని  విజువల్స్ హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. ఈ చిత్రంలో  చిరంజీవి, వెంకటేష్ చేసిన అల్లరి, డ్యాన్స్, పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ని ఆడియెన్స్ చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు అని సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు.  నయనతార హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.