- జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీల మాదిరి గానే ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకూ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో మంగళవారం బీసీ ఉపాధ్యాయ సంఘం, బీసీటీయూ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 40 వేల మంది బీసీలు ఉన్నారని తెలిపారు. బీసీ ఉపాధ్యాయులు ఉన్న సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగుల హక్కుల కోసం మార్చి రెండో వారంలో హైదరాబాద్‌లో వేలాది మందితో రాష్ట్ర మహాసభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
