సింగరేణిలో అధికారుల సమస్యలు పరిష్కరించాలి : పెద్ది నర్సింహులు

సింగరేణిలో అధికారుల సమస్యలు పరిష్కరించాలి :  పెద్ది నర్సింహులు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోల్​మైన్స్​ఆఫీసర్స్​ అసోసియేషన్ ఆఫ్​ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచ్​సెంట్రల్​జనరల్​సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్​ ప్రెసిడెంట్​ పొనుగోటి శ్రీనివాస్​కోరారు. మంగళవారం గోదావరిఖనిలోని ఆఫీస్‌‌లో సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. 

2022 నుంచి 2024 వరకు అధికారుల పనితీరు ఆధారంగా ఇచ్చే పీఆర్‌‌‌‌పీ వేతనం కోల్​ఇండియాలో ఇచ్చారని, సింగరేణిలో మాత్రం పెండింగ్‌‌లో పెట్టారని, దానిని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి సింగరేణి మేనేజ్‌‌మెంట్‌‌ను ఆదేశించాలని కోరారు.

 అలాగే తెలంగాణకు సింగరేణి గుండెకాయ లాంటిదని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్​ల వేలంలో మణుగూరులోని పీకే ఓసీని సంస్థకు కేటాయించాలని కోరారు. సమావేశంలో ఏరియా ప్రెసిడెంట్లు ఎం.రాముడు, కె.వెంకటేశ్వరరెడ్డి, డి.పంతులు, కె.మల్లేశ్‌‌, సంజీవ్ కుమార్, పాల నరేశ్‌‌, జె.శ్రీనివాస్, జక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.