అయ్యప్పస్వాములకు 7 నుంచి అన్నదానం : ఎంపీ అనిల్కుమార్ యాదవ్

అయ్యప్పస్వాములకు 7 నుంచి అన్నదానం : ఎంపీ అనిల్కుమార్ యాదవ్

బషీర్​బాగ్, వెలుగు: శబరిమలలో అయ్యప్ప స్వాముల కోసం శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఏటా అన్నదానం చేయడం అభినందనీయమని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సంబంధిత బ్రోచర్ ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు నీల్ కల్ వెళ్లే మార్గంలో అయ్యప్పస్వాములకు అన్నదానం చేయనున్నారని తెలిపారు.

 3న వంట సామగ్రిని ఉస్మాన్ గంజ్ లోని అయ్యప్ప సేవా సమితి కార్యాలయం నుంచి తీసుకెళ్తున్నట్లు అయ్యప్పస్వాములు చెప్పారు. ప్రతీరోజు 20 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దాతలు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఉస్మాన్ గంజ్ లోని సమితి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.  సమితి అధ్యక్షుడు మేడిశేటి రాకేశ్, కార్యదర్శి భద్రేశ్వర్, కోశాధికారి అనిల్, సభ్యులు విజయ్ భాస్కర్, నరేశ్​పటేల్, సంతోష్, అంజన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.