ఉప్పల్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్‌పోలీసులు అరెస్ట్‌చేశారు. సీఐ ఓంకార్తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన సుధాన్ష్కుమార్ ఉప్పల్హనుమసాయినగర్లో ఉంటూ గంజాయి అమ్ముతున్నాడు. ఉప్పల్పరిసర ప్రాంతాల్లో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు మంగళవారం తనిఖీలు చేపట్టారు.
సుధాన్ష్కుమార్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 5 కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లుసీఐ చెప్పారు. బిహార్నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నాడని తెలిపారు. అతన్ని అరెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురు..
ఘట్కేసర్, వెలుగు: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏపీలోని కాకినాడ నుంచి హైదరాబాదర్కు కారులో గంజాయి తీసుకెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు యంనంపేట్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి చూడగా గంజాయి లభ్యమైంది. 52 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకొని, నిందితులు అంబర్పేట్, పటేల్నరగ్కు చెందిన షేక్ పేర్వలీ, సఫిల్‌గూడకు చెందిన ధరావత్ సుభాష్, మలక్‌పేట్‌కు చెందిన సిరిమల రవికుమార్ ను అరెస్ట్‌చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
