క్వారంటైన్@ హోటల్: మైల్డ్ సింప్టమ్స్ ఉన్నోళ్లకు రిఫర్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లు

క్వారంటైన్@ హోటల్:  మైల్డ్ సింప్టమ్స్ ఉన్నోళ్లకు రిఫర్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లు

బెడ్స్ ఫుల్ కావడంతో హోటల్స్ తో  టై అప్ 
హోటల్​ను బట్టి రోజుకు రూ.6 వేల నుంచి ఛార్జీలు
ఫుడ్, అకామిడేషన్ తోపాటు 24 గంటలు డాక్టర్ అబ్జర్వేషన్ 
ఎమర్జెన్సీ అయితేనే  హాస్పిటల్​కు తరలింపు

హైదరాబాద్, వెలుగు:కరోనా మైల్డ్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్లకు హోటళ్లలో క్వారంటైన్ ఫెసిలిటీని కల్పిస్తున్నాయి  ప్రైవేట్ హాస్పిటళ్లు. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెరిగిపోవడం, బెడ్స్ ఫుల్ కావడంతో హాస్పిటళ్లు ఇప్పుడు మళ్లీ హోటల్స్ తో  టైఅప్ అవుతున్నయి. ఫస్ట్ వేవ్ స్టాస్ట్​ అయినప్పట్నుంచే ఈ ట్రెండ్ ఉంది. ప్రస్తుతం రిక్వైర్మెంట్స్ కు అనుగుణంగా హోటళ్లలో బెడ్లను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒక్కో హాస్పిటల్ తమకు దగ్గరలో ఉన్న హోటల్ తో అనుసంధానమై అవసరాన్ని బట్టి 50  నుంచి వందల సంఖ్యలో రూమ్ లను బుక్ చేసుకుంటున్నాయి. మైల్డ్ సింప్టమ్స్ ఉండి, హోమ్ ఐసోలేషన్ లో ఉండలేని వాళ్లకు హోటల్ క్వారంటైన్ ప్యాకేజీలను 
అందిస్తున్నాయి.
రిక్వైర్మెంట్ పెరిగిపోవడంతో..
సిటీలోని ప్రైవేటు హాస్పిటళ్లలో కేపాసిటీని బట్టి ఒక్కో ఆస్పత్రిలో వంద నుంచి వెయ్యి వరకు బెడ్లు ఉన్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్నందున బెడ్లన్నీ ఫిల్ అయిపోతున్నాయి. ఎమర్జెన్సీ పేషెంట్లకు కూడా బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నోళ్లు హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతున్నారు. దీనివల్ల ఎమర్జెన్సీ పేషెంట్లు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దీంతో మైల్డ్ సింప్టమ్స్ ఉన్నోళ్లకు హోటళ్లలో క్వారంటైన్ కు రిఫర్ చేస్తున్నారు. బెడ్లు తక్కువ, పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేటు హాస్పిటళ్ల మేనేజ్ మెంట్లు చెప్తున్నాయి. హోటళ్లతో టైఅప్ అయి బెడ్స్ రిక్వైర్మెంట్ ను బట్టి రూములను బుక్ చేసుకుంటున్నాయి. ఇందులో సింగిల్, డబుల్ షేరింగ్ కల్పిస్తున్నాయి. హోమ్ ఐసోలేషన్ లో కంటే డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉంటే మంచిదని చాలా మంది పేషెంట్లు భావిస్తున్నారు. దీంతో హాస్పిటళ్లు సూచించిన హోటళ్లలో  క్వారంటైన్ కు రెడీ అవుతున్నారు. హోటల్ లో అయితే డాక్టర్ అందుబాటులో ఉంటారు, ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ లో బెడ్ కూడా ఈజీగా దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిటీలోని ప్రైవేట్ హాస్పిటళ్లు తమ తమ ఏరియాల్లోని హోటళ్లలో 50 నుంచి 200కు పైగా రూమ్ లను బుక్ చేసుకుని క్వారంటైన్ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి.
24 గంటల నర్సింగ్ కేర్..
హోటల్ ను బట్టి క్వారంటైన్ ప్యాకేజీలు రూ.6 వేల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో ఏడు రోజుల క్వారంటైన్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఏసీ రూమ్, టీవీ, వైఫైతోపాటు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ, కాఫీ ఉంటుంది. అలాగే ప్రతి రోజు ఆన్ లైన్ లో డాక్టర్ కన్సల్టేషన్, మానిటరింగ్ చేస్తారు. 24 గంటల నర్సింగ్ కేర్ తోపాటు శాంపిల్ కలెక్షన్ ఉంటుంది. మెడికల్ కిట్ లో థర్మామీటర్, ఆక్సిమీటర్, స్పైరో మీటర్, మాస్కులు, ఎన్ 95 మాస్క్, నాన్ స్టెరైల్ గ్లౌజెస్, హాండ్ శానిటైజర్, జింక్, విటమిన్ సీ టాబ్లెట్లు ఉంటాయి. ఎమర్జెన్సీ మెడికల్ బ్యాకప్ ని అందుబాటులో ఉంచుతున్నారు. సింగిల్ పర్సన్ కు ఏడురోజుకు క్వారంటైన్ ప్యాకేజీ  రూ.40 వేలు, డబుల్ షేరింగ్ ప్యాకేజీ  రూ.30 వేలుగా ఉంది. 
అన్ని రూమ్ లు ఫిల్ అయినయి..
ఓయో కలెక్షన్ హోటల్ తో టైఅప్ అయి 49 రూమ్స్ తీసుకున్నాం. 99 శాతం ఫిల్ అయిపోయాయి. హోటల్ లో ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మెషీన్ పెట్టాం. స్టేబుల్ గా ఉన్న పేషెంట్లనే హోటల్ కు రిఫర్ చేస్తున్నాం. హోటల్ లో డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. రోజుకు సింగిల్ రూమ్ కు రూ.6 వేలు ఛార్జ్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ కు షిఫ్ట్ చేస్తాం. 
- డాక్టర్ రాకేశ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, మెడికవర్ హాస్పిటల్స్
-----