
- సమస్య ఏదైనా కొత్తగూడెం పోవాల్సిందే
- పేరుకపోతున్న సమస్యలు
మందమర్రి, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఐదేళ్లుగా బెల్లంపల్లి రీజియన్‌లో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించకపోవడంతో ప్రతీ చిన్నసమస్య చెప్పుకునేందుకు ఎంప్లాయీస్ వందల కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం హెడ్డాఫీస్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్రీవెన్స్ డేతో పరిష్కారం...
2017లో అప్పటి సింగరేణి డైరెక్టర్(ఫైనాన్స్), ఇన్ చార్జి పరిపాలన డైరెక్టర్‌గా కొనసాగిన పవిత్రన్ కుమార్ గ్రీవెన్స్ డేకు శ్రీకారం చుట్టారు. డివిజన్ లేదా రీజియన్‌లో ఒకరోజు ఈ కార్యక్రమం జరిగేది. ఒక వేళ సమస్య పరిష్కారం కాకపోతే కార్మికులకు డైరెక్టర్ చెప్పుకునేవారు. గ్రీవెన్స్ డేకు వచ్చే వారు అనారోగ్య సమస్యపైనే ఎక్కువగా విన్నవించేవారు. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన వారికి క్వార్టర్ ఫెసిలిటీ కల్పించకపోతే దరఖాస్తు చేసుకునే వారు. ఆఫీసర్లు అప్పటికప్పుడే పరిష్కారం చూపేవారు. మైన్స్, డిపార్ట్మెంట్లలో పనిచేసే ఎంప్లాయీస్ పనిష్మెంట్చర్యల కింద కోల్పోయే బెనిఫిట్స్, రుజువులేని ఆరోపణలు తదితరాలపై ఫిర్యాదు చేసేవారు. మెడికల్ బోర్డుకు వెళ్లిన వారు ఫిట్, అన్‌ఫిట్ అనే విషయాన్ని గ్రీవెన్స్డేలోనే వెల్లడించేవారు. ట్రాన్స్ ఫర్ల సమస్యకు పరిష్కారం దొరికేది. ఇదంతా 2017 నవంబర్ వరకు బాగానే సాగింది. తర్వాత యాజమాన్యం పట్టించుకోలేదు.
బెల్లంపల్లి రీజియన్‌లో..
కార్మికులు తమ ఇబ్బందులను నేరుగా ఉన్నతాధికారులకు చెప్పుకునే అవకాశం ఉన్న గ్రీవెన్స్ డేను పునరుద్ధరించాలని కార్మికులు, కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకరావడంతో గత ఏడాది జులై 28న కొత్తగూడెం రీజియన్, సెప్టెంబర్ 11న రామగుండం రీజియన్ పరిధిలో యామాన్యం ప్రజావాణి నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 10న బెల్లంపల్లి రీజియన్ పరిధిలో నిర్వహిస్తామని చెప్పిన యాజమాన్యం కరోనా సాకుతో వాయిదా వేసింది. ఆరు నెలలుగా దాటినా దాని ఊసేఎత్తలేదు. దీంతో ఐదేళ్లుగా రీజియన్పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించిన 23 వేల మంది కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎంప్లాయీస్ ప్రతీ చిన్న సమస్య పరిష్కారం కోసం వందల కి.మీ దూరంలోని కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్‌కు వెళ్లాల్సి వస్తోంది. స్థానిక ఆఫీసర్లు ఏమో సమస్య తమ పరిధిలో లేదని, కార్పొరేట్‌కు వెళ్లాలంటూ చెప్పిచేతులు దులుపుకుంటున్నారు.
పాదయాత్రలు బంద్...
కాలనీల్లో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ‘జీఎం పాదయాత్ర’లు బాగా ఉపయోగపడేవి. నేరుగా ఏరియా జీఎం, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో కలిసి ఒక్కో కాలనీలో పాదయాత్ర చేస్తుంటే కార్మిక కుటుంబాలు తాము ఎదుర్కొనే సమస్యలు వారి కి వివరించేవారు. జీఎం అక్కడిక్కడే సంబంధిత ఆఫీసర్లతో చర్చించి సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చేవారు. మేజర్ సమస్య ఉంటే కార్పొరేట్యాజమాన్యం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారం చూపేవారు. మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో దీని ఊసేలేకుండా పోయింది. తిరిగి నిర్వహించాలని కార్మికవర్గం డిమాండ్‌చేస్తున్నా.. యాజమాన్యం పట్టించుకోవడంలేదు