
గత చిత్రాలను మించి తాను లోతుగా ఇన్వాల్వ్ అయ్యి తెరకెక్కించిన సినిమా ‘మిరాయ్’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి టీజీ విశ్వ ప్రసాద్ ఇలా ముచ్చటించారు.
మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక అద్భుతమైన చిత్రాన్ని అందివ్వాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా ‘మిరాయ్’. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి తేజకు ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ లేదు. మేం తనతో పాటు ఈ ప్రాజెక్ట్‌ని నమ్మాం. మంచి కథతో పాటు చక్కని మ్యూజిక్, గ్రేట్ లొకేషన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ కుదిరాయి.
అశోకుడు మొత్తం జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన 9 గ్రంథాల రక్షణ బాధ్యతను ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒకటి మాత్రం ఓ ఆశ్రమానికి ఇస్తాడు. ఆ గ్రంథాల ప్రాముఖ్యత ఏమిటి.. వాటి గురించి హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారనేది అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కించాం. చరిత్రతో పాటు ఫిక్షన్ కూడా ఇందులో కలగలిసి ఉంటుంది. ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ ఇది.
ట్రైలర్‌లో శ్రీ రాముడు కనిపించిన సీన్ సహా ఇందులోని ప్రతి ఎలిమెంట్‌కి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. అశోకుడిగా ఒక స్టార్‌ను చూడబోతున్నారు. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే ఇందులో 8 నుంచి 10 లార్జ్ స్కేల్ ఎపిసోడ్స్ ఉన్నాయి.
‘మిరాయ్’ కోసం తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్షన్ సీన్స్ కోసం థాయిలాండ్‌లో శిక్షణ తీసుకున్నారు. అలాగే మనోజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. కార్తిక్ బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో ఏ సీన్ లొకేషన్‌లో తీయాలి, దేనికి సెట్ వేయాలి, గ్రాఫిక్స్‌కు ఎంతవరకు వాడుకోవాలనే విషయంపై తనకు ఫుల్ క్లారిటీ ఉంది.
#MIRAI BOOKINGS OPEN NOW Exclusively on @district_india 💥💥💥
— People Media Factory (@peoplemediafcy) September 9, 2025
Experience India’s Most Ambitious Action Adventure with your KIDS & FAMILIES Only on the BIG SCREENS ❤️🔥
— https://t.co/wUh7ZlcKM2
GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🔥
Superhero @tejasajja123
Rocking Star… pic.twitter.com/SjdiHzN1Pm
అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ మా సంస్థలోనే చేయడం గొప్ప అడ్వాంటేజ్. గ్రాఫిక్స్ బయటికి ఇస్తే చాలా సమస్యలు. వాళ్ళు ఇచ్చిన అవుట్‌పుట్ తీసుకోవాలి. ఇన్ హౌస్ చేయడం వల్ల మన కంట్రోల్‌లో ఉంటుంది.
ఇందులో 20 అడుగుల ఎత్తున్న సంపాతి అనే పక్షి సీన్ కోసం 30 వేల అడుగుల విస్తీర్ణంలో భారీ సెట్ వేశాం. ఆ పక్షిని యానిమాట్రిక్స్ టెక్నాలజీతో చేశాం. ఇది చాలా కాంప్లెక్స్ వర్క్. పక్షితో హ్యూమన్ ఇంటరాక్షన్ వున్న సినిమా మన దేశంలో ఇంతవరకూ రాలేదని భావిస్తున్నా. గత చిత్రాలతో పోల్చితే నేను డీప్‌గా ఇన్వాల్వ్ అయిన చేసిన సినిమా ఇదే. ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఎక్కువ ట్రావెల్ అవుతున్నా.