TelusuKada: రేపేంటో (Sep 11) తెలుసు కదా?.. యూత్‌ క్రేజీగా సిద్దమవ్వండి!

TelusuKada: రేపేంటో (Sep 11) తెలుసు కదా?.. యూత్‌ క్రేజీగా సిద్దమవ్వండి!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ప్రముఖ స్టైలిస్ట్  నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 11న టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.ఈ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తోపాటు ఒక స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  సిద్ధు జొన్నలగడ్డ బాల్కనీలో నిలబడి,  పక్కన కనిపించే శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా వైపు చూడటం.. వీరిద్దరూ చిరునవ్వులు చిందిస్తున్న పోస్టర్ కథలోని ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌ను చూపిస్తోంది. ఈ స్టిల్ యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంది. 

ALSO READ : సంబరాల యేటిగట్టు..

ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా పనిచేస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే సిద్దు జాక్ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకునేలా ఓ అందమైన రొమాంటిక్ ప్రేమకథతో వస్తుండటం విశేషం. దీపావళి కానుకగా అక్టోబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.