సంబరాల యేటిగట్టు.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ కోసం.. బాలీవుడ్ సూపర్ స్టార్

సంబరాల యేటిగట్టు.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ కోసం.. బాలీవుడ్ సూపర్ స్టార్

సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా యాక్షన్ డ్రామా  ‘సంబరాల యేటిగట్టు’.  రోహిత్ కేపీ దర్శకత్వంలో  కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా  ఈ మూవీ షూటింగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందించారు మేకర్స్. మరో వారంలో ప్రారంభమయ్యే అప్ కమింగ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో ఫైట్ మాస్టర్   పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరించనున్నట్టు తెలియజేశారు. 

ఈ సీన్స్‌‌‌‌‌‌‌‌లో  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌తో సాయి దుర్గ తేజ్ తలపడనున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా సీజీ వర్క్ కూడా వేగంగా జరుగుతోందని అన్నారు. దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తేజ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా నిలుస్తుంది. 

ఇందులో తేజ్ రగ్డ్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను  దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఇండస్ట్రీ సమ్మె కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే  కొత్త రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్ చేస్తారు.  బి అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.